ఆటో బోల్తా … వ్యక్తి మృతి
ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణ పాలయ్యాడు. గౌరారం ఏఎస్సై రుక్కుమ్మ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
దిశ, వర్గల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గౌరారం శివారులో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు గ్రామానికి చెందిన ధోరణాల శ్రీకాంత్ (36) బుధవారం రోజున బయ్యారం గ్రామంలోని వారి బంధువుల ఇంటికి వెళ్లి అదే రోజు రాత్రి ఒక్కడే ఆటోలో తిరిగి ములుగు గ్రామానికి వస్తుండగా ఆటోను అజాగ్రత్తగా నడపడం వలన పాతూరు చౌరస్తా వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ఉన్న శ్రీకాంత్ కి బలమైన గాయాలు తగిలాయి. పక్కటెముకు బలంగా దెబ్బతిన్నాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, బంధువులు శ్రీకాంత్ ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బలమైన గాయాలు తగలడంతో శ్రీకాంత్ చికిత్స పొందుతూ… రాత్రి 2 గంటల సమయంలో మృతి చెందాడు. మృతుడి భార్య రజిత, తల్లి రుక్కమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు.