పట్టపగలే దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పు..

పట్టపగలే మహిళపై దుండగులు పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఈ దారుణం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.

Update: 2023-04-11 06:58 GMT
పట్టపగలే దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పు..
  • whatsapp icon

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పట్టపగలే మహిళపై దుండగులు పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఈ దారుణం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. అత్తాపూర్ కు చెందిన శివాని నడుచుకుంటూ వెళ్తుండగా పిల్లర్ నెంబర్ 133 వద్ద దుండగులు ఆమెకు నిప్పంటించారు. విషయం తెలియగానే పోలీసులు అక్కడికి వెళ్లి బాధితురాలిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన భర్తనే నిప్పాంటించాడని బాధితురాలు చెబుతోంది. అయితే ఇదే నిజమా? శివాని ఆత్మహత్యాయత్నం చేసిందా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News