గోదావరి నదిలో పడి యువకుడి మృతి..

బాసరలో శనివారం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని పుణ్యస్నానలకు వచ్చి గోదావరి నదిలో పడి యువకుడు మృతి చెందాడు.

Update: 2023-02-18 16:55 GMT

దిశ, బాసర, ముధోల్ : బాసరలో శనివారం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని పుణ్యస్నానలకు వచ్చి గోదావరి నదిలో పడి యువకుడు మృతి చెందాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా అంఝ గ్రామానికి చెందిన ప్రదీప్(25) స్నేహితుల కలిసి మహా శివరాత్రి పండుగ సందర్భంగా బాసర క్షేత్రానికి వచ్చారు. ముందుగా గోదావరి మొదటి ఘాట్ నది తీరంలో స్నానం ఆచరించడానికి వెళ్లిన ప్రదీప్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయాడు. స్థానిక మత్స్యకారుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. స్నేహితుడు మృతి చెందడంతో తోటి స్నేహితులు కంటతడి పెట్టారు. ఈ మేరకు పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నది లోపలికి వెళ్లకుండా కంచె ఏర్పాటు చేయాలి.

బాసర పుణ్య పుణ్యక్షేత్రంలో గోదావరి నది లోపల పుణ్యస్నానాలకు వెళ్ళ కుండ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులు నదిలో ఈత రాక ప్రమాదవశాత్తుపడి చనిపోయిన ఘటనలు వారి కుటుంబాలను మనోవేదనకు గురి చేస్తున్నాయని, సంబంధిత అధికారులు, దేవాదాయ శాఖ స్పందించి నదిలో లోపలికి వెళ్లకుండా ప్రత్యేకంగా కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే నిజామాబాద్ పట్టణానికి చెందిన ఓ గృహిణి తన కుమారుడు, కుమార్తెను నదిలోకి తీసి ఆత్మహత్య చేసుకున్న ఘటనపలువురిని కంటతడి పెట్టించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మొదటి ఘాట్ నుండి బ్రిడ్జ్ వరకు కంచె ఏర్పాటు చేయాలని, దీంతో పాటే బ్రిడ్జి పైన జాలీలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News