తనయుడి బాగుకోరిన తండ్రి.. మనస్థాపానికి గురై యువకుడి ఆత్మహత్య..
తనయుడి బాగుకోసం తండ్రి మంచి చెబితే.. కోపం చేశాడని మనస్థాపానికి గురై యువకుడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం వెలుగు చూసింది.

దిశ, రాజాపేట : తనయుడి బాగుకోసం తండ్రి మంచి చెబితే.. కోపం చేశాడని మనస్థాపానికి గురై యువకుడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మల్ల గూడెం గ్రామానికి చెందిన రెడ్డబోయిన హరిబాబు, అలియాస్ అభి (19) ఆరు రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయాడు.
బంధువుల ఇంటికి వెళ్లి ఉంటాడని వెతికిన ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో తండ్రి మల్లయ్య ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం కొండేటి చెరువు చెరువు సమీప గుట్టమీద ఉరి వేసుకున్న హరిబాబు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హరిబాబు బాడీ అని గుర్తించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి .