సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు రూ. 53 లక్షల కుచ్చుటోపీ

సైబర్​ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. టాస్క్​ పేరుతో హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్​ వేర్ ఇంజనీర్ ను ఉచ్ఛులోకి లాగి 53 లక్షల రూపాయల కుచ్చుటోపీ పెట్టారు.

Update: 2023-07-10 14:08 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సైబర్​ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. టాస్క్​ పేరుతో హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్​ వేర్ ఇంజనీర్ ను ఉచ్ఛులోకి లాగి 53 లక్షల రూపాయల కుచ్చుటోపీ పెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ సాఫ్ట్​వేర్​ కంపెనీలో ఇంజనీర్ ​గా పనిచేస్తున్న ఉద్యోగికి కొన్ని రోజుల క్రితం టెలిగ్రామ్ ద్వారా ఓ పోస్ట్​ వచ్చింది. ఓపెన్​ చూసి చూడగా మేమిచ్చిన టాస్క్​ పూర్తి చేస్తే ఇంటి వద్దనే కూర్చుని పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని అందులో ఉంది. దీనికి స్పందించిన సాఫ్ట్​ వేర్ ఇంజనీర్​ తాను సిద్దమంటూ రిప్లై ఇవ్వగా సైబర్​ నేరగాళ్లు అతనికి కొన్ని టాస్కులు ఇచ్చారు.

వాటిని సాఫ్ట్ వేర్ ఇంజనీర్​ పూర్తి చేయగా కొంత డబ్బు కూడా పంపించారు. తమను పూర్తిగా నమ్మినట్టు నిర్ధారించుకున్న తరువాత తాము చెప్పిన స్కీముల్లో పెట్టుబడులు పెడితే లక్షలు సంపాదించవచ్చని ఆశ పెట్టారు. ఈ క్రమంలో సదరు సాఫ్ట్​ వేర్​ ఇంజనీర్ ​53 లక్షల రూపాయలను పెట్టుబడులుగా సైబర్​ నేరగాళ్లు చెప్పిన బ్యాంక్ ​అకౌంట్లకు క్రెడిట్​ చేశాడు. ఆ తరువాత వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో మోసపోయినట్టు గ్రహించి సైబర్​ క్రైం పోలీస్ స్టేషన్ లో ​లో ఫిర్యాదు చేశాడు.

Tags:    

Similar News