వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆరేళ్ళ చిన్నారి..

నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Update: 2024-10-04 10:54 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొద్దిరోజుల క్రితం బోధన్ పట్టణం ఓ చిన్నారి పై జరిగిన కుక్కల దాడి ఘటన మరవక ముందే నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో శుక్రవారం ఓ చిన్నారి పై వీధి కుక్కలు దాడి చేశాయి.

హరినేత్ర అనే ఆరేళ్ల పాప పై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇంటి దగ్గరలో ఉన్న కిరాణాషాపులో టీయూ బండారాలు కొనుక్కుని తిరిగి ఇంటికి వెళ్తుండగా పాప పై వీధి కుక్కదాడి చేసింది. చిన్నారి చెంప, పెదవి పై కుక్క కరవడంతో లోతుగా గాలయ్యాయి. చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. దాడికి సంబంధించిన వీడియో సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News