Gay Appలో పరిచయం.. శారీరక సంబంధం కోసం వెళ్లిన యువకుడు.. చివరికి ఏమైందంటే..

Update: 2024-10-26 07:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే రాజేష్ (మారుపేరు) ఈ మధ్యనే ఓ గే అప్లికేషన్ (Gay App) ఇన్‌స్టాల్ చేసుకుని అందులో జాయిన్ అయ్యాడు. అక్కడ రుద్ర (యాప్ నేమ్) అనే ఓ వ్యక్తితో పరిచయమైంది. ఇద్దరి మధ్య కొంతకాలం మాటలు నడిచాయి. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు. ఓరోజు రాజేష్‌కి కాల్ చేసిన రుద్ర ఇద్దరం శారీరకంగా కలుద్దామని కోరాడు. రాజేష్ కూడా చాలా హ్యాపీగా సాయంత్రం ఆఫీస్ కంప్లీట్ చేసుకుని రుద్ర దగ్గరకు వెళ్లాడు. రాజేష్ కోసమో బైక్‌పై వెయిట్ చేస్తున్నాడు రుద్ర. రాజేష్ వెళ్లి రుద్రని కలిశాడు. అతడితో పాటు మరో వ్యక్తి కూడా అక్కడ ఉండటంతో అతడెవరని ప్రశ్నించాడు. అతడు తన స్నేహితుడేనని అతడికి అంతా తెలుసని నమ్మించి రాజేష్‌ని బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు.

కొంత దూరం వెళ్లిన తర్వాత ఓ నిర్మాణుష్య ప్రదేశంలో సడెన్‌గా బైక్ ఆపి రాజేష్‌ను కిందికి దించాడు రుద్ర. అంతలో వెనకున్న వ్యక్తి రాజేష్‌పై దాడి చేసి తన స్నేహితుడికి అలాంటి మెసేజ్‌లు ఎందుకు పెడుతున్నావంటూ దారుణంగా కొట్టాడు. రుద్ర కూడా రాజేష్‌పై దాడి చేశాడు. అతడి దగ్గరున్న ఐఫోన్ 8 (Iphone 8) మొబైల్ ఫోన్, వెయ్యి రూపాయల నగదు కూడా లాక్కున్నారు. ఆ తర్వాత మళ్లీ బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్తుంటే.. భయంతో రన్నింగ్‌లో ఉన్న బైక్‌పై నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు రాజేష్. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకుంది. దుండగుల నుంచి తప్పించుకున్న రాజేష్ భయంతో ఇంటికి వెళ్లిపోయాడు. అయితే అతడి స్నేహితులకు విషయం తెలిసి పోలీస్ కంప్లైట్ (Police Complaint) ఇవ్వమని ధైర్యం చెప్పడంతో చివరికి పోలీసుల వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పి కంప్లైట్ ఇచ్చాడు.

ఇక ఈ కంప్లైంట్‌ను సీరియస్‌గా తీసుకున్న రాజ్‌కోట్ డీజీపీ జోన్ 2 జగదీప్ బంగరవా త్వరిగ గతిన దర్యాప్తు జరిపి నిందితులిద్దరినీ అదుపులోనికి తీసుకున్నారు. అయితే వాళ్లిద్దరిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, ఇంతకుముందు ఇలా ఎవరిపైనా బెదిరింపులకు పాల్పడింది లేదని పోలీసులు తెలిపారు. ఈ యాప్ ద్వారా యువకులను ట్రాప్ చేసి దోచుకోవాలని రుద్ర, అతడి స్నేహితుడు ప్లాన్ చేసినట్లు వెల్లడైందని చెప్పారు.

Tags:    

Similar News