ఫ్యాక్టరీలో వ్యక్తి మృతదేహం లభ్యం..

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నాందేడ్ రహదారిలో గల పడిగెల ఫ్యాక్టరీలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయ్యింది.

Update: 2023-03-08 13:12 GMT

దిశ, బైంసా : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నాందేడ్ రహదారిలో గల పడిగెల ఫ్యాక్టరీలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయ్యింది. స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం సిరాల గ్రామానికి చెందిన శేక్ హైమద్ మియా (60) స్థానిక వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. కాగా అదే ఫ్యాక్టరీలో బుధువారం విగతజీవిగా పడివున్నాడు. ఒంటి పై గాయాలు వుండడంతో హత్యచేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలుకోణాల్లో ఆరా తీస్తున్నారు.

ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పలువురు బీహార్ వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించారు. షేక్ హైమద్ మియా హత్యకి బీహార్ వాళ్ళకి సంబంధం ఏదైనా వుందా అనేకోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న బీహార్ గ్యాంగ్ సమాచారం కోసం ఇప్పటికే ఓ పోలీసు ప్రత్యేక బృందం నిఘా ఉంచింది. సంఘటనా స్థలానికి డాగ్స్ స్క్వాడ్ చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఇది హాత్య లేక ఆత్మహత్య అనే విషయం త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News