బావిలో నుంచి బోర్ తీస్తూ వ్యక్తి మృతి..
మృత్యు ఏ క్షణాన ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు అనేది నగ్నసత్యం.
దిశ, గాంధారి : మృత్యు ఏ క్షణాన ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు అనేది నగ్నసత్యం. ఒకవైపు బుధవారం గిరిజన వాసుల ఆరాధ్యదేవమైన సేవలాల్ మహారాజ్ జయంతి అంగరంగ వైభవంగా చేద్దామనుకున్న తరుణంలో వ్యక్తి మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం గురజాల తండాకు చెందిన గోతి కన్వర్ (37) తన పొలంలో బోరు మోటారు కాలిపోవడంతో దాన్ని తీసేప్రయత్నం చేశాడు.
మోటార్ ని తీసే తరుణంలో కట్టె విరిగి అక్కడే ఉన్న కన్వర్ మెడ పై పడింది. దీంతో కన్వర్ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ సంఘటనతో గుర్జల్ తండాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కన్వర్ కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకరు నిజాంసాగర్ లో, ఇంకొకరు బోధన్ లో విద్యాభ్యాసం చేస్తున్నారు. కన్వర్ మృతిని తెలుసుకొని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కుటుంబ సభ్యులను ఓదార్చాడు. కన్వర్ కి మున్సిపట్ల ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.