బైక్‌ను ఢీకొట్టి 12 కి.మీ ఈడ్చుకెళ్లిన బస్సు.. చివరకు ఏం జరిగిందంటే..?

ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోతోందనిపిస్తోంది.

Update: 2023-05-21 06:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోతోందనిపిస్తోంది. రోడ్డుపై వెళ్తుంటే ఏదైనా ప్రమాదం జరిగితే సాటిగా మనిషిగా సహయం చేయాల్సింది పోయి.. ఏకంగా వారే ప్రమాదం చేసిన వాహనాలను ఆపకుండా అలాగే వెళ్లిపోతున్నారు. పక్కవారు వారి వాహనాలకు చిక్కుకున్న ఆపకుండా అలాగే వెళ్లడం విచారకరం. ఇటీవల కాలంలో దేశంలో ఇలాంటి చాలా చోటు చేసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిని కారుతో ఢీకొట్టి అలాగే 10 కిమీ ఈడ్చుకెళ్లగా.. బెంగళూరులో ఓ యువతి కారుతో యువకుడిని ఢీకొట్టి కారు బానెట్‌పైనే పది కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలను పూర్తిగా మరవకముందే తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో ఆదివారం ఓ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. అయితే, బైక్‌ను ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా 12 కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లాడు. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ తీరుపై పలువురు మండిపడుతున్నారు.   

Tags:    

Similar News