Ganjai Seize: రూ.20 లక్షల విలువైన గంజాయి పట్టివేత

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం ఈదులబయలు వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి లభ్యమైంది.

Update: 2024-12-03 09:29 GMT

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం ఈదులబయలు వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి లభ్యమైంది. సుమారు రూ.20 లక్షల విలువైన 400 కేజీల గంజాయి సంచుల్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న జీపును సీజ్ చేసి.. నలుగురిని అరెస్ట్ చేశారు.

బడ్డీ కొట్టులో గంజాయి చాక్లెట్ల విక్రయం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఈటీ గ్రామంలో బడ్డీ దుకాణాన్ని పెట్టిన ఒడిశాకు చెందిన వ్యక్తి.. ఆయుర్వేదం మందులని చెప్తూ.. గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎక్సైజ్ సిబ్బంది అక్కడికి చేరుకుని చాక్లెట్లను పరిశీలించారు. 175 గ్రాముల గంజాయి, 400 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని, ఉదయానంద్ ను అరెస్ట్ చేశారు. కార్మికులు, విద్యార్థులే లక్ష్యంగా ఈ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. చాక్లెట్లలో 14 శాతం గంజాయి ఉంటుందని, 10 గ్రాముల గంజాయిని రూ.200 కు అమ్ముతున్నట్లు నిందితుడి చెప్పాడన్నారు. ఎవరైనా ఇలాంటివి గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని నరసరావుపేట పోలీసులు కోరారు. 

Tags:    

Similar News