ఆర్మూర్ లో 12 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్..

ఆర్మూర్ మండలంలో మంగళవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్మూర్ పోలీసులు కోమన్ పల్లి, పిప్రి గ్రామాల్లోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 12 మంది పేకాటరాయుళ్లను పట్టుకుని అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ బుధవారం తెలిపారు.

Update: 2024-12-25 09:31 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలో మంగళవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్మూర్ పోలీసులు కోమన్ పల్లి, పిప్రి గ్రామాల్లోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 12 మంది పేకాటరాయుళ్లను పట్టుకుని అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ బుధవారం తెలిపారు.

కోమన్ పల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న ఆ పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేసి ఐదుగురు పేకాట రాయుళ్లను పట్టుకొని, పేకాట ఆడుతున్న సదరు వ్యక్తుల నుంచి ఐదు మొబైల్ ఫోన్లను, నాలుగు బైకులను, పేక ముక్కలతో పాటు 7040 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మండలంలోని పిప్రి గ్రామంలో నమ్మదగిన సమాచారం మేరకు పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 5 మొబైల్ ఫోన్ లను, 8450 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రామాల్లో పేకాట స్థావరాల్లో పట్టుబడిన పేకాట రాయుళ్ల పై కేసులు నమోదు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్య నారాయణ గౌడ్ తెలిపారు.


Similar News