మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఐదు లీటర్ల పెట్రోలు.. ఫొటో వైరల్

దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్‌లో బాగా ఆడిన వారికి ఇచ్చే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానుకగా అందజేసేందుకు ఎక్కడైనా నగదు ప్రోత్సహకాలను ఇస్తారు. అంతర్జాతీయ క్రికెట్ పోటీలలో అయితే అది ఖరీదైన కార్లు, బైకుల వంటివి కూడా ఉంటాయి. కానీ ఒక క్రికెట్ మ్యాచ్‌లో మాత్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్న వ్యక్తికి ఐదు లీటర్ల పెట్రోలును అందజేయడం గమనార్హం. ఇదెక్కడో కాదు. ఇండియాలోనే. మధ్యప్రదేశ్‌లో స్థానికంగా జరుగుతున్న ఒక టోర్నమెంట్‌లో […]

Update: 2021-03-03 00:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్‌లో బాగా ఆడిన వారికి ఇచ్చే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానుకగా అందజేసేందుకు ఎక్కడైనా నగదు ప్రోత్సహకాలను ఇస్తారు. అంతర్జాతీయ క్రికెట్ పోటీలలో అయితే అది ఖరీదైన కార్లు, బైకుల వంటివి కూడా ఉంటాయి. కానీ ఒక క్రికెట్ మ్యాచ్‌లో మాత్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్న వ్యక్తికి ఐదు లీటర్ల పెట్రోలును అందజేయడం గమనార్హం. ఇదెక్కడో కాదు. ఇండియాలోనే. మధ్యప్రదేశ్‌లో స్థానికంగా జరుగుతున్న ఒక టోర్నమెంట్‌లో భాగంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన వ్యక్తికి పెట్రోలును బహుమతిగా అందజేశారు నిర్వాహకులు.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. భోపాల్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు మనోజ్ శుక్లా ఈ టోర్నీని నిర్వహించాడు. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన ఒక మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శన కనబరిచిన సలావుద్దీన్ అబ్బాసీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. దీంతో అతడికి ఐదు లీటర్ల పెట్రోలును బహుకరించారు నిర్వాహకులు.

https://twitter.com/Cric_Beyond_Ent/status/1366333221827448832?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1366333221827448832|twgr^|twcon^s1_&ref_url=https://www.india.com/viral/bhopal-cricketer-gets-5-litres-of-petrol-as-award-for-winning-man-of-the-match-picture-is-a-hit-online-4462061/

ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఐదు లీటర్ల క్యాన్‌పై ప్రధాని మోడీ క్యారికేచర్ కూడా ముద్రించి ఉంది. కాగా ఈ పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. గతంలో తమిళనాడులో ఒక పెట్రోల్ బంక్ యాజమాన్యం.. చిన్న పిల్లలు ప్రముఖ తమిళ కవి తిరువల్లూరు చెప్పిన పద్యాలను కంఠతా చెబితే లీటరు పెట్రోలును ఉచితంగా పోస్తామని ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర రూ. 100 దాటగా.. డీజిల్ రూ. 88 గా ఉంది.

Tags:    

Similar News