పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ కోల్పోయిన రోబో డాగ్
దిశ, ఫీచర్స్ : హైటెక్ క్రైమ్ ఫైటింగ్‌లో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రశంసలు అందుకున్న రోబోటిక్ డాగ్.. ప్రజల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకత వల్ల తిరిగి దాని ఓనర్ దగ్గరకు పంపబడింది. పోలీస్ బడ్జెట్ తగ్గించాలన్న డిమాండ్స్‌తో పాటు పోలీస్ మిలిటరైజేషన్ ఆందోళనలు, ఫోర్స్ దుర్వినియోగం పట్ల ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో రోబో డాగ్‌కు సంబంధించి, దాని తయారీదారు బోస్టన్ డైనమిక్స్‌తో 94,000 డాలర్ల ఒప్పందాన్ని న్యూయార్క్ పోలీసులు రద్దు చేసుకున్నారు. టెస్ట్ ప్రోగ్రామ్‌లో […]
దిశ, ఫీచర్స్ : హైటెక్ క్రైమ్ ఫైటింగ్‌లో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రశంసలు అందుకున్న రోబోటిక్ డాగ్.. ప్రజల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకత వల్ల తిరిగి దాని ఓనర్ దగ్గరకు పంపబడింది. పోలీస్ బడ్జెట్ తగ్గించాలన్న డిమాండ్స్‌తో పాటు పోలీస్ మిలిటరైజేషన్ ఆందోళనలు, ఫోర్స్ దుర్వినియోగం పట్ల ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో రోబో డాగ్‌కు సంబంధించి, దాని తయారీదారు బోస్టన్ డైనమిక్స్‌తో 94,000 డాలర్ల ఒప్పందాన్ని న్యూయార్క్ పోలీసులు రద్దు చేసుకున్నారు.
టెస్ట్ ప్రోగ్రామ్‌లో డివైస్‌ను పొందిన తర్వాత గతేడాది డిసెంబర్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ ‘డిజిడాగ్’ను పబ్లిక్‌కు పరిచయం చేసింది. ‘ఈ రోబో డాగ్ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు ప్రమదాలను గుర్తించి అధికారులకు భరోసాను ఇవ్వగలదు’ అని NPYD టెక్నికల్ అసిస్టెన్స్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ ఫ్రాంక్ డిజియాకోమో ఆ టైమ్‌లో లోకల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుమారు 70 పౌండ్లు గల ఈ చురుకైన డాగ్, నేర పరిశోధనలో భాగంగా.. సులభంగా మెట్లు ఎక్కడంతో పాటు ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లను సేఫ్‌గా ఉంచగలిగే సామర్థ్యాన్ని కలిగివుందని తెలిపారు. అంతేకాదు ఇది గతంలో ఉపయోగించిన రోబోల కంటే తక్కువ ఖర్చు, మరింత అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఈ డిజిడాగ్ సొంతమని వెల్లడించారు.
అయితే, తక్కువ రంగు ఉన్న పిల్లలు చదువుతున్న స్కూల్స్‌లో సర్వైలెన్స్ కోసం ఈ రోబో డాగ్స్‌ను ఏర్పాటుచేయడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో పాటు వీటిపై చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ను.. ఆ జాతి వాళ్ల కోసం స్కూళ్లు నిర్మించేందుకు ఉపయోగించాలనే వాదనలు పెరుగుతున్నాయి. క్రమంగా ఇది రేసిజం సమస్యలను లేవనెత్తడంతో పాటు గోప్యతా ప్రమాణాల విషయంలోనూ నిరసనలకు దారితీస్తుండటంతో తయారీదారు ‘బోస్టన్ డైనమిక్స్’తో కాంట్రాక్టును రద్దుచేసుకున్నట్టు NPYD డిప్యూటీ కమిషనర్ జాన్ మిల్లర్ వెల్లడించారు.