గడ్డకట్టిన తేనె తింటున్న టిక్‌టాకర్స్.. హెచ్చరిస్తున్న ఎక్స్‌పర్ట్స్
దిశ, ఫీచర్స్ : షార్ట్ వీడియోస్ షేరింగ్ యాప్ టిక్ టాక్ గురించి తెలిసిందే. ఈ చైనీస్ యాప్‌ను ఇండియాలో బ్యాన్ చేసినప్పటికీ దాని ట్రెండ్స్ సోషల్ మీడియాలో ప్రతీవారం వైరల్‌గా మారుతుంటాయి. డ్యాన్స్, కామెడీ, ఎడ్యుకేషన్ తదితర అంశాలపై అన్ని వయసుల వారికి ఇన్‌ఫర్మేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంటుంది. ఇదే క్రమంలో టిక్ టాక్ యూజర్లకు విసిరిన కొన్ని చాలెంజెస్ విమర్శలకు గురికాగా, వాటి వల్ల ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. https://youtu.be/ALp1ebdHyJ8 సోషల్ మీడియా […]
దిశ, ఫీచర్స్ : షార్ట్ వీడియోస్ షేరింగ్ యాప్ టిక్ టాక్ గురించి తెలిసిందే. ఈ చైనీస్ యాప్‌ను ఇండియాలో బ్యాన్ చేసినప్పటికీ దాని ట్రెండ్స్ సోషల్ మీడియాలో ప్రతీవారం వైరల్‌గా మారుతుంటాయి. డ్యాన్స్, కామెడీ, ఎడ్యుకేషన్ తదితర అంశాలపై అన్ని వయసుల వారికి ఇన్‌ఫర్మేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంటుంది. ఇదే క్రమంలో టిక్ టాక్ యూజర్లకు విసిరిన కొన్ని చాలెంజెస్ విమర్శలకు గురికాగా, వాటి వల్ల ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
https://youtu.be/ALp1ebdHyJ8
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రస్తుతం ఒక వైరల్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా టిక్‌టాకర్లు గడ్డకట్టిన తేనెను తింటున్న వీడియోలు పోస్టు చేస్తున్నారు. దాదాపు 80 మిలియన్ యూజర్లు #FrozenHoney హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తుండటంతో ఈ ట్రెండ్ టిక్ టాక్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇందులో రకరకాల చాలెంజెస్ ఉన్నాయి. కొంతమంది తేనె తక్కువ సాంద్రత ఉండేలా అది గడ్డకట్టే ముందే తేనెలో కార్న్ సిరప్ కలుపుతున్నారు.
మరికొంతమంది చాక్లెట్, తేనెతో పాటు కార్న్ సిరప్‌ను కలిపి విచిత్రమైన ప్రొడక్ట్ తయారుచేస్తున్నారు. అయితే ఫ్రోజెన్ హనీ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని, కడుపు నొప్పికి దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. విరేచనాలతో పాటు కడుపు ఉబ్బరం వంటివి అనుభవించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి అంటుకునే పదార్థం దంతాలను గాయపరుస్తుందని, కావిటీస్‌కు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.