టిక్కెట్లు.. టిక్కెట్లు.. అంటున్న యూజర్‌లు
దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి దీపావళి, రాఖీ, న్యూఇయర్‌లకు ఏదో ఒక కాంటెస్ట్ నిర్వహిస్తూ గూగుల్ పే యాప్ తమ యూజర్‌లను ఎప్పుడు గ్రిప్‌లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. అలాగే ఈ ఏడాది కూడా గో ఇండియా కాంటెస్ట్ పేరుతో యూజర్‌లను వర్చువల్‌గా దేశమంతా తిప్పుతోంది. ఈ కాంటెస్ట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై ప్రముఖ నగరాలను యూజర్‌లను సందర్శించాల్సి ఉంటుంది. అలా సందర్శించడానికి టికెట్‌లు, కి.మీ.లు సంపాదించాలి. అందుకోసం గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేయడం, చెల్లింపులు చేయడం, […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి దీపావళి, రాఖీ, న్యూఇయర్‌లకు ఏదో ఒక కాంటెస్ట్ నిర్వహిస్తూ గూగుల్ పే యాప్ తమ యూజర్‌లను ఎప్పుడు గ్రిప్‌లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. అలాగే ఈ ఏడాది కూడా గో ఇండియా కాంటెస్ట్ పేరుతో యూజర్‌లను వర్చువల్‌గా దేశమంతా తిప్పుతోంది. ఈ కాంటెస్ట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై ప్రముఖ నగరాలను యూజర్‌లను సందర్శించాల్సి ఉంటుంది. అలా సందర్శించడానికి టికెట్‌లు, కి.మీ.లు సంపాదించాలి. అందుకోసం గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేయడం, చెల్లింపులు చేయడం, గో ఇండియా కాంటెస్ట్ గురించి షేర్ చేయడం ద్వారా టికెట్‌లు, కి.మీ.లు సంపాదించాలి.
నవంబర్ చివరి వరకు ఉన్న ఈ కాంటెస్ట్‌ను ఇప్పటికే కొందరు పూర్తిచేశారు. అయితే 24 నుంచి 26 నగరాలు సందర్శించి, ఆ మిగిలిన నాలుగు నగరాల టికెట్ల కోసం యూజర్‌లు తెగ తాపత్రయపడుతున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వచ్చిన టికెట్లే వస్తున్నాయి కానీ కావాల్సిన టికెట్లు రావడం లేదని యూజర్‌లు ఫిర్యాదులు చేస్తున్నారు. అందులో వచ్చే రూ. 500ల కోసం అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్‌లు చేసినవారైతే అత్యంత నిరుత్సాహంతో ఉన్నారు. టికెట్ల కోసం అందరినీ అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తోందని, ఇలా కాంటెస్ట్‌ల పేరుతో టైంపాస్ చేయడం గూగుల్ పే తగ్గించుకోవాలని వారు అంటున్నారు. ఇక ఈ పరిస్థితి గురించి ఎన్నో మీమ్‌లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.