కేంద్రంపై సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి ఫైర్‌

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారింది. భారీ సంఖ్యలో రైతులు ఆందోళనలో పాల్గొనడంతో పోలీసులకు, రైతులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల ఆందోళనను అదుపు చేయలేని క్రమంలోలాఠీచార్జ్‌ చేయడంతోపాటు, బాష్ఫవాయు గోళాలను సైతం పోలీసులు ప్రయోగించారు. బాష్ఫవాయు గోళాలు ప్రయోగించడంపై సీపీఐ(ఎం) పార్టీ ఆగ్రహం […]

Update: 2021-01-26 07:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారింది. భారీ సంఖ్యలో రైతులు ఆందోళనలో పాల్గొనడంతో పోలీసులకు, రైతులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల ఆందోళనను అదుపు చేయలేని క్రమంలోలాఠీచార్జ్‌ చేయడంతోపాటు, బాష్ఫవాయు గోళాలను సైతం పోలీసులు ప్రయోగించారు. బాష్ఫవాయు గోళాలు ప్రయోగించడంపై సీపీఐ(ఎం) పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులపై బాష్ఫవాయు గోళాలు ప్రయోగించడం, లాఠీచార్జ్‌ చేయడం సరికాదని సీతారం ఏచూరి అన్నారు. అలాంటప్పుడు రైతులు, ఢిల్లీ పోలీసుల మధ్య చర్చలు, ఒప్పందం ఎందుకని ప్రశ్నించారు. రైతులు శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీని కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించాలంటూ సీతారాం ఏచూరి ట్వీట్టర్ వేదికగా డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News