బీజేపీ విధానాలు ప్రమాదకరం !

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ప్రమాదకరమని, ప్రజలంతా కేంద్ర విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్బంగా రాఘవులు మాట్లాడుతూ ఈ నెల 26,27 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్ధతును ప్రకటించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల హక్కులను కాలరాసేలా బీజేపీ వ్యవహరిస్తుందని, […]

Update: 2020-11-09 12:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ప్రమాదకరమని, ప్రజలంతా కేంద్ర విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్బంగా రాఘవులు మాట్లాడుతూ ఈ నెల 26,27 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్ధతును ప్రకటించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల హక్కులను కాలరాసేలా బీజేపీ వ్యవహరిస్తుందని, సార్వత్రిక సమ్మెకు బీఎంఎస్ తప్ప అన్ని కార్మిక సంఘాలు మద్ధతునిచ్చాయని గుర్తు చేశారు. విద్యుత్ పంపిణీ వ్యవస్తను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రతిపాదనలను అన్ని రాష్ట్రాల్లోని ఉద్యోగులు, రైతులు వ్యతిరేకిస్తున్నారన్నారు.

Tags:    

Similar News