వైసీపీ, జనసేన మాతో కలిసి రావాలి : సీపీఎం

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రైవేటీకరణను సీపీఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు స్పందించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌ పరం చేస్తే.. ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 32 మంది ప్రాణత్యాగాల ఫలితం […]

Update: 2021-02-05 08:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రైవేటీకరణను సీపీఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు స్పందించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌ పరం చేస్తే.. ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 32 మంది ప్రాణత్యాగాల ఫలితం విశాఖ ఉక్కు పరిశ్రమ అన్నారు. పరిశ్రమను కాపాడుకునేందుకు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. విభజన హామీలను అమలు చేయడలంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. ఈ పోరాటంలో వైసీపీ, జనసేన మాతో కలిసి రావాలని పిలునిచ్చారు.

Tags:    

Similar News