మహాభారతాన్ని తలచుకుంటే కరోనా పారిపోదు : సీపీఐ(ఎంఎల్)

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రధాని మోడీ చెప్పినట్లు ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు ఇండ్లల్లోని లైట్లన్నీ ఆర్పి, కొవ్వొత్తులు దీపాలు వెలిగిస్తేనో.. మహాభారతాన్ని మదిలో తలచుకుంటేనో.. కరోనా పారిపోదని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కె. గోవర్ధన్ అన్నారు. కరోనా కల్లోల కాలంలో దేశ ప్రధాని ఇవ్వాల్సిన పిలుపు ఇది కాదన్నారు. కరోనా వైరస్ భారీ నుంచి ప్రజలను రక్షించాలంటే యుద్ధప్రాతిపదికన వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని, అందుకోసం భారీ బడ్జెట్ కేటాయించాలని కోరారు. దేశంలో […]

Update: 2020-04-03 10:12 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రధాని మోడీ చెప్పినట్లు ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు ఇండ్లల్లోని లైట్లన్నీ ఆర్పి, కొవ్వొత్తులు దీపాలు వెలిగిస్తేనో.. మహాభారతాన్ని మదిలో తలచుకుంటేనో.. కరోనా పారిపోదని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కె. గోవర్ధన్ అన్నారు. కరోనా కల్లోల కాలంలో దేశ ప్రధాని ఇవ్వాల్సిన పిలుపు ఇది కాదన్నారు. కరోనా వైరస్ భారీ నుంచి ప్రజలను రక్షించాలంటే యుద్ధప్రాతిపదికన వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని, అందుకోసం భారీ బడ్జెట్ కేటాయించాలని కోరారు. దేశంలో మెజారిటీలైన పేదలు, వలస కూలీలు, దినసరి కూలీలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. చాలా ప్రాంతాల్లో మాస్కులు, గ్లౌజులు తగినంత లేకపోవడంతో వైద్యులు, ఇతర సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన నిధులు, వైద్యపరికరాలను అందజేయాలని కోరారు.

Tags: PM Modi, Mahabharatam, CPI(ML) New Democracy

Tags:    

Similar News