ఉగ్రవాదం నిర్మూలనలో కేంద్రం విఫలం : చాడ
దిశ, ముషీరాబాద్: దేశంలో ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో మోడీ సర్కారు విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. పుల్వామా దాడి ఘటన జరిగి రెండేళ్లైన సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ మిలిటరీ ట్యాంక్ వద్ద అమరులకు నివాళులర్పించారు. చాడ వెంకట్‌రెడ్డి, ఈటీ నరసింహ, పలువురు నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. దాడుల్లో మన భద్రతా బలగాలు మరణిస్తుంటే దాడులకు పాకిస్తానే కారణమని కేంద్రం చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబిస్తామని […]
దిశ, ముషీరాబాద్: దేశంలో ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో మోడీ సర్కారు విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. పుల్వామా దాడి ఘటన జరిగి రెండేళ్లైన సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ మిలిటరీ ట్యాంక్ వద్ద అమరులకు నివాళులర్పించారు. చాడ వెంకట్‌రెడ్డి, ఈటీ నరసింహ, పలువురు నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. దాడుల్లో మన భద్రతా బలగాలు మరణిస్తుంటే దాడులకు పాకిస్తానే కారణమని కేంద్రం చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబిస్తామని బీజేపీ చేసిన ప్రతిన ఏమైందన్నారు. దేశ సంపదను కార్పొరేట్, విదేశీ శక్తులకు అమ్ముకోవడంలో మోడీకి ఉన్న శ్రద్ధ దేశ భద్రతపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.