రాష్ట్రం మీ సొంత జాగీరు కాదు: రామకృష్ణ

విజయవాడ: కోవిడ్ పేరుతో మోడీ మొదట్లో చాలా హడావుడి చేశారు కానీ, ఆ తర్వాత చర్యలను గాలికి వదిలేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రజలు కరోనాతో భయపడుతుంటే.. ప్రత్యర్థి ప్రభుత్వాలను దింపే పనిలో మోదీ ఉన్నారన్నారు. ఏపీలో సీఎం చేసిన వ్యాఖ్యలతో కరోనాను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదని, ఇప్పుడు కేసులు పెరిగాక మాత్రం అన్నీ చేస్తున్నామంటూ ఆర్భాటంగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కరోనా రోగులకు అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఆరోగ్య శ్రీ […]

Update: 2020-07-27 02:18 GMT

విజయవాడ: కోవిడ్ పేరుతో మోడీ మొదట్లో చాలా హడావుడి చేశారు కానీ, ఆ తర్వాత చర్యలను గాలికి వదిలేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రజలు కరోనాతో భయపడుతుంటే.. ప్రత్యర్థి ప్రభుత్వాలను దింపే పనిలో మోదీ ఉన్నారన్నారు. ఏపీలో సీఎం చేసిన వ్యాఖ్యలతో కరోనాను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదని, ఇప్పుడు కేసులు పెరిగాక మాత్రం అన్నీ చేస్తున్నామంటూ ఆర్భాటంగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

కరోనా రోగులకు అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఆరోగ్య శ్రీ కింద కరోనాను చేరిస్తే..‌ ఏ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందుతుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంత బాగా జరుగుతుంటే.. మీ నాయకుడు స్పెషల్ ప్లైట్ వేసుకుని హైదరాబాద్‌కు ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. జగన్ తరువాత రెండో స్థానంలో ఉన్న వ్యక్తికే ఇక్కడ వైద్యానికి దిక్కు లేదన్నారు.

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి.. చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రం మీ సొంత జాగీరు కాదంటూ తీవ్రంగా ఆగ్రహించారు. కనీసం జూమ్ ద్వారా అయినా అత్యవసరంగా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News