మీ దోస్త్ ఇచ్చాడు కదా..మీరూ ఇవ్వండి

దిశ, కరీంనగర్: ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ లీక్ అయిన ఘటనలో చనిపోయిన కుటుంబాలకు సీఎం జగన్ ప్రకటించినట్టుగానే, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పరిహారం ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో ఓసీపీ పేలుళ్ల బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.ఈ సందర్బంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ..బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం తప్పనిసరిగా అందించాలన్నారు. మీ మిత్రుడు ఏపీ సీఎం జగన్ పాలిమార్స్ ఘటనలో రూ.కోటి ఇచ్చారని, అదే […]

Update: 2020-06-03 06:43 GMT

దిశ, కరీంనగర్: ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ లీక్ అయిన ఘటనలో చనిపోయిన కుటుంబాలకు సీఎం జగన్ ప్రకటించినట్టుగానే, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పరిహారం ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో ఓసీపీ పేలుళ్ల బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.ఈ సందర్బంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ..బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం తప్పనిసరిగా అందించాలన్నారు. మీ మిత్రుడు ఏపీ సీఎం జగన్ పాలిమార్స్ ఘటనలో రూ.కోటి ఇచ్చారని, అదే తరహాలో ఓసీపీ పేలుళ్ల బాధితులకు నష్టపరిహారం అందించాలన్నారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని కోరారు. అలాగే ఈ ప్రమాదం మానవ తప్పిదం వల్లె జరిగిందని, ముమ్మాటికి ఇది సింగరేణి యాజమాన్యం చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. ఎక్స్ ప్లోజివ్స్‌ను సంస్థ మాత్రమే వినియోగించాలని కానీ, ప్రైవేటు కంపెనీలు అమర్చడం నిబంధనలకు విరుద్ధమేనన్నారు.30 ఏళ్లలో ఇలాంటి పేలుడు ఏనాడు జరగలేదని, అనుభవం లేని కాంట్రాక్టు కార్మికులతో పనిచేయించడం వల్లే దారుణం జరిగిందని సీపీఐ నారాయణ ఆరోపించారు.

Tags:    

Similar News