కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే మద్దతుపై ఆలోచిస్తాం !
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఆచరణలోకి వచ్చినప్పుడు మద్దతు ఇచ్చే అంశంపై ఆలోచిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. రాష్ట్రాల హక్కులను హరించడానికి మోడీ సర్కార్ యత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జీఎస్టీ ప్రతిపాదన తీసుకువస్తే అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ వ్యతిరేకించారని, ఇప్పుడు ప్రధాని అయ్యాక జీఎస్టీ తీసుకువచ్చి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన భాగం ఇవ్వడం లేదని మండిపడ్డారు. కొవిడ్ కారణాలతో పాటు ఏవేవో సాకులు చెబుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఆచరణలోకి వచ్చినప్పుడు మద్దతు ఇచ్చే అంశంపై ఆలోచిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. రాష్ట్రాల హక్కులను హరించడానికి మోడీ సర్కార్ యత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జీఎస్టీ ప్రతిపాదన తీసుకువస్తే అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ వ్యతిరేకించారని, ఇప్పుడు ప్రధాని అయ్యాక జీఎస్టీ తీసుకువచ్చి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన భాగం ఇవ్వడం లేదని మండిపడ్డారు. కొవిడ్ కారణాలతో పాటు ఏవేవో సాకులు చెబుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ కేంద్రంపై పోరాటం చేస్తే మద్దతు ఇస్తామన్నారు. రెవెన్యూ చట్టంపై అభిప్రాయం చెప్పాలని సీఎం కేసీఆరే.. చాడా వెంకటరెడ్డిని పిలిపించుకున్నారని పేర్కొన్నారు.
Read Also…