కాంచనపల్లి అమరవీరుల త్యాగం గొప్పది : మాచర్ల సత్యం

దిశ, టేకులపల్లి: భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరులను స్మరిస్తూ నవంబర్ 1 నుండి 9 వరకు జరిగే అమరవీరుల వర్ధంతి సభలను జయప్రదం చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి మాచర్ల సత్యం పిలుపునిచ్చారు. బుధవారం టేకులపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. పేద ప్రజల విముక్తి కోసం, దున్నే వారికే భూమి దక్కాలన్న నినాదంతో ఎంతోమంది వీరులు పోలీసుల ఎన్ కౌంటర్‌లో ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. కాంచనపల్లి అమరవీరులైనటువంటి ఎల్లన్న, […]

Update: 2021-10-27 06:23 GMT

దిశ, టేకులపల్లి: భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరులను స్మరిస్తూ నవంబర్ 1 నుండి 9 వరకు జరిగే అమరవీరుల వర్ధంతి సభలను జయప్రదం చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి మాచర్ల సత్యం పిలుపునిచ్చారు. బుధవారం టేకులపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. పేద ప్రజల విముక్తి కోసం, దున్నే వారికే భూమి దక్కాలన్న నినాదంతో ఎంతోమంది వీరులు పోలీసుల ఎన్ కౌంటర్‌లో ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు.

కాంచనపల్లి అమరవీరులైనటువంటి ఎల్లన్న, పగడాల వెంకన్న, దొరన్న, బాటన్న, రవన్న, ముస్మి, పోతన్న, కాంపాటి చంద్రం తదితరులు తమ నూరేళ్ల జీవితాన్ని ప్రజల కోసం అర్పించారని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వర్ధంతి సభలను గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు డి.ప్రసాద్, న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి ధర్మపురి వీర బ్రహ్మాచారి, నాయకులు నాగరాజు, భూక్యా పంతులు, సుడిగాలి వెంకన్న, లింగయ్య, చింత రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News