రాజ్‌భవన్ ముట్టడికి వెళ్తున్న నాయకులు అరెస్ట్

దిశ, ఆలేరు: భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపుతో మంగళవారం రాజ్ భవన్ ముట్టడికి వెళ్తున్న నాయకులను ఆలేరు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేశ్, ముఖ్య నాయకులు స్టేషన్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలనలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి నియంతృత్వంగా […]

Update: 2021-11-23 05:28 GMT

దిశ, ఆలేరు: భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపుతో మంగళవారం రాజ్ భవన్ ముట్టడికి వెళ్తున్న నాయకులను ఆలేరు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేశ్, ముఖ్య నాయకులు స్టేషన్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలనలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజల పక్షాన సీపీఐ పార్టీ పోరాటం సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, మాటూరి జానమ్మ, చౌడబొయిన పరుశరాములు, రాజారెడ్డి, పేరపు రాములు, అంజనేయులు, జంగమ్మ, సరళ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News