‘కేసీఆర్.. భూములు ఎవడబ్బ సొమ్మని అమ్ముతున్నావ్..’

దిశ, భద్రాచలం : విషజ్వరాలతో రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతుంటే, అధికార టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ సంబురాలు జరుపుకోవడం హాస్యాస్పదమని, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం భద్రాచలం సీపీఐ కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమాన్ని విస్మరించి కేవలం ఎన్నికలు, ఉపఎన్నికలు, ఓట్లు, సీట్లు, పండుగ సంబరాలకే పరిమితమై ప్రజలను […]

Update: 2021-09-02 07:45 GMT

దిశ, భద్రాచలం : విషజ్వరాలతో రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతుంటే, అధికార టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ సంబురాలు జరుపుకోవడం హాస్యాస్పదమని, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం భద్రాచలం సీపీఐ కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమాన్ని విస్మరించి కేవలం ఎన్నికలు, ఉపఎన్నికలు, ఓట్లు, సీట్లు, పండుగ సంబరాలకే పరిమితమై ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. మిగులు రాష్ట్రంగా ఉండాల్సిన రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని, మరో అడుగు ముందుకువేసి ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల్లో కేంద్రంలోని మోడీ సర్కారుతో పోటీపడుతూ కోట్లాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూములను, ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ ఆస్తులను అమ్మేసి తమ ఖజానాను నింపుకునే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వీఆర్ఎస్, సీఆర్ఎస్ పేరుతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను గెంటివేసే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవడబ్బ సొమ్మని ఆర్టీసీ ఆస్తులను, ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారని ప్రశ్నించారు. ఈ దేశాన్ని ప్రైవేటుకు తాకట్టుపెడుతున్న ప్రధాని మోడీకి, ప్రజల ఆస్తులు అమ్ముతున్న సీఎం కేసీఆర్‌ పాలనలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు బలపడాలన్నారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీ.అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ‌.. పాలకుల నిర్లక్ష్యం వల్లే జిల్లాలో పోడు సమస్య తీవ్రమవుతుందని, అనాదిగా పోడు సాగుచేసుకుంటున్న పేదలకు హక్కు పత్రాలు ఇవ్వకుండా భూములను లాక్కునే ప్రయత్నంలో దాడులకు, నిర్భందాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్నారని, బ్రతుకు కోల్పోతున్న పేదలు, రైతులు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారని అన్నారు. ఏపూరి బ్రహ్మం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, కల్లూరి వెంకటేశ్వర్లు, సరెడ్డి పుల్లారెడ్డి, కే.సారయ్య, తమ్ముళ్ల వెంకటేశ్వరరావు, మున్నా లక్ష్మీకుమారి, కమటం వెంకటేశ్వరరావు, ఆకోజు సునీల్, రావులపల్లి రవికుమార్, ఎస్ డీ సలీం, నరాటి ప్రసాద్, వై. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News