జీవో నెంబర్ 203ను రద్దు చేయాలి

దిశ, ఎల్బీనగర్: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ కోసం జారీ చేసిన జీవో నెం.203ను వెంటనే రద్దు చేయాలని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఆందోజు రవీంద్రచారి డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ పార్టీ హయత్ నగర్ మండల కమిటీ కార్యదర్శి సోమిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రవీంద్రచారి మాట్లాడుతూ.. జీఓ నెం.203తో దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారే అవకాశముందన్నారు. నెట్టంపాడు, డిండి, […]

Update: 2020-06-10 10:41 GMT

దిశ, ఎల్బీనగర్: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ కోసం జారీ చేసిన జీవో నెం.203ను వెంటనే రద్దు చేయాలని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఆందోజు రవీంద్రచారి డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ పార్టీ హయత్ నగర్ మండల కమిటీ కార్యదర్శి సోమిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రవీంద్రచారి మాట్లాడుతూ.. జీఓ నెం.203తో దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారే అవకాశముందన్నారు. నెట్టంపాడు, డిండి, భీమా, పాలమూరు -రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిచేయలేదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దక్షిణ తెలంగాణపై ప్రభుత్వానికి వివక్షత ఎందుకని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ఎ.వెంకన్న, లక్ష్మణాచారి, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి వి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News