ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా

దిశ, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ర్ట రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. మూడు నెలలుగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతుండగా వారిపై విద్యుత్ బిల్లుల భారాలు మోపుతూ ప్రభుత్వం నిరంకుశత్వం ప్రదర్శిచడం […]

Update: 2020-06-16 08:05 GMT

దిశ, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ర్ట రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. మూడు నెలలుగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతుండగా వారిపై విద్యుత్ బిల్లుల భారాలు మోపుతూ ప్రభుత్వం నిరంకుశత్వం ప్రదర్శిచడం తగదన్నారు. ఈ మూడు నెలల విద్యుత్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం కార్యాలయంలో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందచేశారు.

Tags:    

Similar News