విజయ్ దేవరకొండతో కలిసి సీపీ సజ్జనార్..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సోకిన బాధితులకు ప్లాస్మాథెరపీ సంజీవని అయింది. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ సీపీ సజ్జనార్ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ప్లాస్మా యోధుల పోస్టర్‌ను తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరోనా రోగులకు ప్లాస్మా దానం చేస్తోన్న వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను జయించి డిశ్చార్జి అయిన వారు […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సోకిన బాధితులకు ప్లాస్మాథెరపీ సంజీవని అయింది. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ సీపీ సజ్జనార్ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ప్లాస్మా యోధుల పోస్టర్‌ను తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరోనా రోగులకు ప్లాస్మా దానం చేస్తోన్న వారిని ఘనంగా సన్మానించారు.
అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను జయించి డిశ్చార్జి అయిన వారు ప్లాస్మా దానం చేయడం గొప్ప సేవ అంటూ అభినందించాడు. ప్రాణదాతలుగా నిలుస్తున్న డోనర్స్‌కు విజయ్ ధన్యవాదాలు తెలిపాడు. అటు కరోనా భారీన పడ్డ డైరెక్టర్ రాజమౌలి కూడా ప్లాస్మా ధానం చేయడానికి ముందుకు రావడం హర్షనీయమన్నాడు. గత పది రోజుల్లో మొత్తం 160 మంది ప్లాస్మా దానం చేశారని సీపీ సజ్జనార్ వివరణ ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ దానం చేయడానికి ముందుకు రావాలని ఇరువురు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.