వరంగల్ కమిషనరేట్‌లో హ్యాండ్ వాషింగ్ సిస్టమ్
దిశ, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో చేతులు శుభ్రపర్చుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫుట్ ఆపరేటింగ్ హ్యాండ్ వాషింగ్ సిస్టంను పోలీస్ కమిషనర్ రవీందర్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తించే సిబ్బందితోపాటు వచ్చే సందర్శకుల చేతులు శుభ్రపరచుకోవడం తప్పనిసరి చేస్తూ ఫుట్ ఆపరేటింగ్ హ్యాండ్ వాషింగ్ సిస్టంను ఏర్పాటు చేశామన్నారు. ఈ సిస్టం ద్వారా శానిటైజర్, నీటి పంపును తాకకుండా కాలితో పెడల్స్ నొక్కడం ద్వారా వాటర్ ట్యాప్, శానిటైజర్‌ను ఆపరేటింగ్ […]
దిశ, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో చేతులు శుభ్రపర్చుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫుట్ ఆపరేటింగ్ హ్యాండ్ వాషింగ్ సిస్టంను పోలీస్ కమిషనర్ రవీందర్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తించే సిబ్బందితోపాటు వచ్చే సందర్శకుల చేతులు శుభ్రపరచుకోవడం తప్పనిసరి చేస్తూ ఫుట్ ఆపరేటింగ్ హ్యాండ్ వాషింగ్ సిస్టంను ఏర్పాటు చేశామన్నారు. ఈ సిస్టం ద్వారా శానిటైజర్, నీటి పంపును తాకకుండా కాలితో పెడల్స్ నొక్కడం ద్వారా వాటర్ ట్యాప్, శానిటైజర్‌ను ఆపరేటింగ్ చేస్తూ చేతులను శుభ్రపరుచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు వెంకటలక్ష్మి, మల్లారెడ్డి, తిరుపతి, భీంరావు, గిరిరాజు, ఏసీపీ సదానందం, గంగాధర్, ఆర్ఐలు భాస్కర్, శ్రీనివాస్ రావు, హథీరాం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Warangal commisionarate,foot operating system,open, cp Ravinder