ఎన్నికల కోసం సర్వం సిద్ధం: రాచకొండ సీపీ

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాచకొండలోని 13 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో భాగంగా 1072 సాధారణ, 512 సమస్యాత్మక, 53 అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లను గుర్తించామన్నారు. మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. 29 చెక్‌పోస్టులు, […]

Update: 2020-11-30 05:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాచకొండలోని 13 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో భాగంగా 1072 సాధారణ, 512 సమస్యాత్మక, 53 అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లను గుర్తించామన్నారు. మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. 29 చెక్‌పోస్టులు, 90 పికెట్స్, 104 వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. పేరుగాంచిన 89 రౌడీషీటర్లను బైండోవర్, 140 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామని మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News