సాహసం చేయరా డింబకా
దిశ, కరీంనగర్: సాహసంతో కూడిన సేవ చేయాలన్న సంకల్పం మీలో ఉందా? సమాజ శ్రేయస్సు కోసం ఎలాంటి టాస్క్‌నైనా ఛేజ్ చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారా? అయితే కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి అందుకు అవకాశం కల్పిస్తున్నారు. కరీంనగర్ వాసులకు సేవలందించేందుకు వలంటీర్లుగా అవకాశం కల్పిస్తామంటున్నారు. వ్యాపార సంస్థలు, కూరగాయల మార్కెట్ వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీపీ చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చొరవ చూపడంతోపాటు నగర వాసులకు వివిధ […]
దిశ, కరీంనగర్: సాహసంతో కూడిన సేవ చేయాలన్న సంకల్పం మీలో ఉందా? సమాజ శ్రేయస్సు కోసం ఎలాంటి టాస్క్‌నైనా ఛేజ్ చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారా? అయితే కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి అందుకు అవకాశం కల్పిస్తున్నారు. కరీంనగర్ వాసులకు సేవలందించేందుకు వలంటీర్లుగా అవకాశం కల్పిస్తామంటున్నారు. వ్యాపార సంస్థలు, కూరగాయల మార్కెట్ వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీపీ చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చొరవ చూపడంతోపాటు నగర వాసులకు వివిధ సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. నగరంలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో యువకులు ముందుకు రావాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఆసక్తి ఉన్న యువత, స్వచ్ఛంద సంస్థలు 9440795109 నెంబర్‌కు వాట్సప్ ద్వారా వివరాలు పంపించాలని సూచించారు.
Tags: karimnagar,cp kamlasan reddy,volunteer,details, whats aap