అంజన్నను దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్..
జగిత్యాల జిల్లా శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామిని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గురువారం రోజున దర్శించుకున్నారు.

దిశ, కొండగట్టు : జగిత్యాల జిల్లా శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామిని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గురువారం రోజున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట బీసీ కమిషన్ సభ్యులు జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్ గౌడ్, డీపీఓ మదన్మోహన్ మల్యాల, తహశీల్దార్ మునీందర్, ఆలయ సిబ్బంది ఉన్నారు.