భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

దిశ, క్రైమ్ బ్యూరో: బక్రీద్ పర్వదిన పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా చార్మినార్, మక్కా మసీదుల వద్ద పోలీసు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. వాస్తవ పరిస్థితుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బక్రీదు పండుగను మసీదులలో ముస్లీం సోదరులు ప్రశాంతంగా నిర్వహించుకున్నట్టు తెలిపారు. ప్రజలెవరైనా… అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. లేదంటే, ఇంట్లోనే ఉండాలన్నారు. కార్యక్రమంలో క్రైమ్ […]

Update: 2020-08-01 09:41 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: బక్రీద్ పర్వదిన పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా చార్మినార్, మక్కా మసీదుల వద్ద పోలీసు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. వాస్తవ పరిస్థితుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బక్రీదు పండుగను మసీదులలో ముస్లీం సోదరులు ప్రశాంతంగా నిర్వహించుకున్నట్టు తెలిపారు. ప్రజలెవరైనా… అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. లేదంటే, ఇంట్లోనే ఉండాలన్నారు. కార్యక్రమంలో క్రైమ్ విభాగం అడిషనల్ సీపీ శిఖా గోయెల్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ డీఎస్ చౌహాన్, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీ తరుణ్ జోషి, డీసీపీ గాజరావు భూపాల్ పాల్గొన్నారు.

Tags:    

Similar News