స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించిన సీపీ అంజనీకుమార్

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించిన అందరికీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో జీహెచ్ఎంసీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన సీపీ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో మొత్తం 15 కౌంటింగ్ కేంద్రాలు ఉండగా, అందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14, సైబరాబాద్ పరిధిలోని సనత్ నగర్ 1 ఉన్నాయని తెలిపారు. అంతేగాకుండా బ్యాలెట్ బాక్సులకు మూడంచెల భద్రత ఏర్పాటు […]

Update: 2020-12-02 03:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించిన అందరికీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో జీహెచ్ఎంసీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన సీపీ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో మొత్తం 15 కౌంటింగ్ కేంద్రాలు ఉండగా, అందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14, సైబరాబాద్ పరిధిలోని సనత్ నగర్ 1 ఉన్నాయని తెలిపారు. అంతేగాకుండా బ్యాలెట్ బాక్సులకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని అన్నారు. టీఎస్‌ఎస్‌పీ, సిటీ ఆర్మ్డ్, సివిల్ మూడు విభాగాల సిబ్బంది ఉన్నారని అన్నారు. బ్యాలెట్ బాక్సులు సీజింగ్‌ను వీడియో తీశామని వెల్లడించారు. అదేవిధంగా సనత్‌నగర్ కౌంటింగ్ కేంద్రాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు.

Tags:    

Similar News