డ్రైవర్ల నేర చరిత్రను తెలుసుకోవాలి

దిశ, క్రైమ్‌బ్యూరో: ఆటో, క్యాబ్ డ్రైవర్లను నియామకం చేసుకునే సమయంలో వారి నేరచరిత్ర తెలుసుకోవాలని యాజమానులకు సీపీ అంజనీకుమార్ సూచించారు. డ్రైవర్ల నేర చరిత్రకు సంబంధించిన అంశంపై ట్రాఫిక్ పోలీసు అధికారులు.. యాజమానులకు అవగాహన కల్పించాలన్నారు. సోమవారం సీపీ అంజనీకుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ డ్రైవర్ల నేరాల సమాచారాన్ని యాజమానులతో పాటు ఆటో, క్యాబ్ డ్రైవర్ల యూనియన్‌లకు తెలపాలన్నారు. నగరంలోని డ్రైవర్ల సమాచారాన్ని ప్రతినెలా తెలుసుకుని యాజమానులకు తెలియజేయాలని ట్రాఫిక్ అధికారులకు […]

Update: 2020-08-24 11:18 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: ఆటో, క్యాబ్ డ్రైవర్లను నియామకం చేసుకునే సమయంలో వారి నేరచరిత్ర తెలుసుకోవాలని యాజమానులకు సీపీ అంజనీకుమార్ సూచించారు. డ్రైవర్ల నేర చరిత్రకు సంబంధించిన అంశంపై ట్రాఫిక్ పోలీసు అధికారులు.. యాజమానులకు అవగాహన కల్పించాలన్నారు. సోమవారం సీపీ అంజనీకుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ డ్రైవర్ల నేరాల సమాచారాన్ని యాజమానులతో పాటు ఆటో, క్యాబ్ డ్రైవర్ల యూనియన్‌లకు తెలపాలన్నారు. నగరంలోని డ్రైవర్ల సమాచారాన్ని ప్రతినెలా తెలుసుకుని యాజమానులకు తెలియజేయాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. యాజమానులు ఉద్యోగ అవకాశం కల్పించే ముందు వారి చరిత్రను తప్పక చెక్ చేసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ సీపీ శిఖా గోయెల్, ట్రాఫిక్ విభాగం అడిషనల్ సీపీ అనిల్ కుమార్, డీసీపీ ఎల్‌ఎస్ చౌహాన్ పాల్గొన్నారు.

Tags:    

Similar News