మహిళకు వెనువెంటనే కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసులు.. బిహార్‌లో ఘటన
పాట్నా: బిహార్‌లో ఓ మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలోనే కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసులు వేశారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్న ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నది. ఈ నెల 16న పాట్నా సమీపంలోని పున్‌పున్ బ్లాక్‌లో ఈ ఘటన జరిగింది. బెల్దరిచక్ స్కూల్‌లో నిర్వహించిన వ్యాక్సినేషన్ క్యాంపులో 16న సునీలా దేవీ టీకా వేసుకోవడానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక తొలుత కొవిషీల్డ్ డోసు వేశారని, అనంతరం అబ్జర్వేషన్ రూమ్‌లో ఐదు నిమిషాలు ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారని […]
పాట్నా: బిహార్‌లో ఓ మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలోనే కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసులు వేశారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్న ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నది. ఈ నెల 16న పాట్నా సమీపంలోని పున్‌పున్ బ్లాక్‌లో ఈ ఘటన జరిగింది. బెల్దరిచక్ స్కూల్‌లో నిర్వహించిన వ్యాక్సినేషన్ క్యాంపులో 16న సునీలా దేవీ టీకా వేసుకోవడానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక తొలుత కొవిషీల్డ్ డోసు వేశారని, అనంతరం అబ్జర్వేషన్ రూమ్‌లో ఐదు నిమిషాలు ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారని సునీలా దేవీ చెప్పారు. అబ్జర్వేషన్ రూమ్‌కు మరో నర్సు కొవాగ్జిన్ టీకా వేయడానికి వచ్చారని వివరించారు. అప్పటికే కొవిషీల్డ్ తాను తీసుకున్నట్టు చెప్పినా అదే చేతికి ఈ టీకా కూడా వేసుకోవాలని నర్సు తెలిపినట్టు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ వ్యాక్సినేషన్ క్యాంపులోని చంచలా దేవీ, సునీతా కుమారీలు వివరణ ఇవ్వాల్సిందిగా ఆరోగ్య శాఖ నోటీసులు పంపింది.