పిల్లలకు కొవిడ్ టీకా.. అనుమతి లేకున్నా ప్రైవేట్ ఆసుపత్రుల ప్రీ బుకింగ్ దందా

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా థర్డ్ వేవ్ ఆందోళనల నేపథ్యంలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ను వీలైనంత తొందరగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసర్తతు చేస్తోంది. ఇప్పటికే 2 నుంచి 18 ఏళ్ల పిల్లలకు అందించే వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతినిచ్చింది. డిసెంబరులోగా వినియోగంలోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంకేతం ఇచ్చింది. ఇదే అదునుగా భావించిన పలు ప్రైవేట్ ఆస్పత్రులు ‘ప్రీ బుకింగ్‌’ పేరుతో దందాను మొదలుపెట్టాయి. కోవాగ్జిన్ టీకా అయితే 28 రోజుల […]

Update: 2021-10-20 05:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా థర్డ్ వేవ్ ఆందోళనల నేపథ్యంలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ను వీలైనంత తొందరగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసర్తతు చేస్తోంది. ఇప్పటికే 2 నుంచి 18 ఏళ్ల పిల్లలకు అందించే వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతినిచ్చింది. డిసెంబరులోగా వినియోగంలోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంకేతం ఇచ్చింది. ఇదే అదునుగా భావించిన పలు ప్రైవేట్ ఆస్పత్రులు ‘ప్రీ బుకింగ్‌’ పేరుతో దందాను మొదలుపెట్టాయి. కోవాగ్జిన్ టీకా అయితే 28 రోజుల వ్యవధి చొప్పున రెండు డోసులు, జైడస్ టీకా అయితే 30 రోజుల గ్యాప్‌తో మూడు డోసులని ఆ ఆస్పత్రులు నిర్ణయించాయి.

కాగా నగరంలోని రెయిన్‌బో పిల్లల ఆస్పత్రి ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకంగా భారీ స్థాయిలో వాణిజ్య ప్రకటనే ఇచ్చింది. ఆన్‌లైన్ ద్వారా బుకింగ్‌ను కూడా ఓపెన్ చేసింది. తేదీని కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో రిజర్వు స్లాట్‌లో పెడుతున్నది. కోవాగ్జిన్ టీకాలు 2-18 ఏళ్ల వయసు పిల్లలకు, జైడస్ టీకా 12-18 ఏళ్ల టీనేజీ పిల్లలకు మాత్రమే ఇవ్వనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నది. విద్యా సంస్థల్లోనే ప్రత్యేక క్యాంపులు పెట్టి టీకాలు ఇవ్వనున్నామని, ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చంటూ ఆఫర్ ప్రకటించింది. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లు, కార్పొరేట్ వ్యాపార సంస్థల్లోనూ ఈ తరహా స్పెషల్ క్యాంపులు నిర్వహించడానికి సిద్ధమంటూ ప్రకటించుకున్నది. ఈ విషయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సైతం సైలెంట్‌గానే ఉండిపోవడం గమనార్హం.

Tags:    

Similar News