16నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ షురూ
దిశ, వెబ్‌డెస్క్ : ఈనెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. సుమారు 3వేల కేంద్రాల ద్వారా కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు వంద మందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. మార్చి నాటికి వ్యాక్సినేషన్ కేంద్రాలను 12వేలకు పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. తొలుత వ్యాక్సినేషన్ ప్రక్రియను దేశ ప్రధాని మోడీ 16వ తేదీన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలోనే తొలిదశలో రాష్ట్రాలకు 1.65 కోట్ల కోవిషీల్డ్, కోవాగ్జిన్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఈనెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. సుమారు 3వేల కేంద్రాల ద్వారా కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు వంద మందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.
మార్చి నాటికి వ్యాక్సినేషన్ కేంద్రాలను 12వేలకు పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. తొలుత వ్యాక్సినేషన్ ప్రక్రియను దేశ ప్రధాని మోడీ 16వ తేదీన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలోనే తొలిదశలో రాష్ట్రాలకు 1.65 కోట్ల కోవిషీల్డ్, కోవాగ్జిన్ డోసులను సరఫారా చేసినట్లు తెలుస్తోంది.