కొవిడ్ పేషెంట్లకు న్యాయం చేస్తున్న ‘లాయర్’
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయితే, మొదట ఆ పేషెంట్‌కు కాస్త భయంగానే ఉంటుంది. వారి కుటుంబంలోనూ ఆందోళన మొదలవుతుంది. ఆ పాజిటివ్ సోకిన వ్యక్తి పరిస్థితి బాగుంటే ఓకే గానీ, వైద్యం అవసరమైతే తప్పనిసరిగా ఆస్పత్రికి వెళ్లాల్సిందే. కానీ చాలా వరకు ఆస్పత్రుల్లో ‘నో బెడ్స్’ అన్న బోర్డులే దర్శనమిస్తున్నాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్‌లో ఆ పేషెంట్ పరిస్థితి ఏం కావాలి? అలాంటివారి కోసమే నేనున్నానంటూ.. ఓ లాయర్ ముందుకొచ్చాడు. కరోనా పేషెంట్లకు […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయితే, మొదట ఆ పేషెంట్‌కు కాస్త భయంగానే ఉంటుంది. వారి కుటుంబంలోనూ ఆందోళన మొదలవుతుంది. ఆ పాజిటివ్ సోకిన వ్యక్తి పరిస్థితి బాగుంటే ఓకే గానీ, వైద్యం అవసరమైతే తప్పనిసరిగా ఆస్పత్రికి వెళ్లాల్సిందే. కానీ చాలా వరకు ఆస్పత్రుల్లో ‘నో బెడ్స్’ అన్న బోర్డులే దర్శనమిస్తున్నాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్‌లో ఆ పేషెంట్ పరిస్థితి ఏం కావాలి? అలాంటివారి కోసమే నేనున్నానంటూ.. ఓ లాయర్ ముందుకొచ్చాడు. కరోనా పేషెంట్లకు ఆయా ఆస్పత్రుల్లో బెడ్లను సమకూరుస్తున్నాడు.
మన దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఏ విధంగా విజృంభిస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేక పేషెంట్లను తిప్పి పంపిస్తున్న విషయం తెలుసుకున్న అడ్వొకేట్ హేమంత్ గులాటీ.. వారికి న్యాయం చేయాలనుకున్నాడు. ఢిల్లీ హైకోర్టు, డిస్ట్రిక్ కోర్టుల్లో పది సంవత్సరాల అనుభవమున్న హేమంత్.. అందుకోసం సోషల్ మీడియాను ఉపయోగించుకున్నాడు. తన వాట్సాప్ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తూ.. ‘ఏ ఆస్పత్రి సిబ్బంది అయినా బెడ్స్ లేవని తిప్పి పంపిస్తే.. నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు సాయం అందిస్తాను. రిట్ పిటిషన్ ధాఖలు చేసి.. మీకు బెడ్ సౌకర్యం అందిస్తాను. మీకు తెలిసిన వాళ్లకు, బంధువులకు ఎవరికి ఇలా జరిగినా, నా నెంబర్ వారికి ఇవ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా ఏకమవ్వాలి. ఈ మెసేజ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి’ అని రాసుకొచ్చాడు. అంతే ఈ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. హేమంత్‌కు గతంలో రోజుకు 90-100 వరకు ఈ తరహా కాల్స్ వచ్చేవి. ఇప్పుడు 30-40 కాల్స్ వస్తున్నాయి.
‘జూన్ -జులైలో చాలా మంది కరోనా బాధితులు వైద్యం అందక చనిపోయారు. నా దృష్టిలో చికిత్స తీసుకోవడం ప్రతి పౌరుడి హక్కు. అంతేకాదు, నేను ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుల గురించి పోరాడుతున్నాను. కోర్టు ముందు చాలా కేసులుంటాయి. కానీ నేను వీలైనంత త్వరగా ఈ స్పెషల్ కేసులను కోర్టు ముందుంచుతున్నాను. అదే రోజు తీర్పు వచ్చేలా ప్రయత్నించాను. అందులో పూర్తిగా విజయం సాధించాను. అయితే, ఓ కరోనా పేషెంట్‌కు మాత్రం.. సరైన సమయానికి సాయం చేయలేకపోయాను. దానికి ఇప్పటికీ బాధపడుతున్నాను. నేను పిటిషన్ దాఖలు చేయడానికి అన్ని సిద్ధం చేశాను. కానీ అప్పటికే నాకు ఫోన్ వచ్చింది ఆ పేషెంట్ చనిపోయాడని, ఆ రోజు చాలా బాధపడ్డాను’ అని హేమంత్ వివరించారు.
ఇప్పటికే ఎంతోమందికి సాయం చేసిన హేమంత్.. మరింత మందికి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కరోనా వల్ల ఏ ఒక్కరి ప్రాణం కూడా పోకూడదన్నదే అతని సంకల్పం.
Read Also..