కేంద్రంపై మరింత రుణభారం!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి రుణ భారం పెరిగిపోతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి స్థూల మార్కెట్ రుణ సమీకరణ అంచనాలను కేంద్రం రూ. 7.8 లక్షల కోట్ల నుంచి రూ. 12 లక్షల కోట్లకు పెంచేసింది. కొవిడ్-19 వల్ల రుణాలను సవరించడం అవసరమని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఆదాయానికి, వ్యయానికి మధ్య అసమతుల్యతను తీర్చేందుకు ప్రభుత్వం మార్కెట్ రుణాలను తీసుకోవడం జరుగుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల మార్కెట్ రుణాల అంచనా […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి రుణ భారం పెరిగిపోతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి స్థూల మార్కెట్ రుణ సమీకరణ అంచనాలను కేంద్రం రూ. 7.8 లక్షల కోట్ల నుంచి రూ. 12 లక్షల కోట్లకు పెంచేసింది. కొవిడ్-19 వల్ల రుణాలను సవరించడం అవసరమని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఆదాయానికి, వ్యయానికి మధ్య అసమతుల్యతను తీర్చేందుకు ప్రభుత్వం మార్కెట్ రుణాలను తీసుకోవడం జరుగుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల మార్కెట్ రుణాల అంచనా రూ. 7.8 లక్షల కోట్లకు బదులుగా రూ. 12 లక్షల కోట్లు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. కొవిడ్-19 కారణంగా రుణాలను సవరించడం అవసరమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే, ఆర్థిక సంవత్సరం మొదటి భాగం సవరించిన రుణాల క్యాలెండర్‌ను కూడా విడుదల చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 7.8 లక్షల కోట్ల స్థూల రుణాలను తీసుకుంటామని చెప్పారు. ఇది గత ఆర్థిక సంవత్సరం అంచనా వేసిన రూ. 7.1 లక్షల కోట్ల కంటే అధికం. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం, ద్రవ్యలోటు లక్ష్యాన్ని కూడా ఆర్థికశాఖ పెంచే అవకాశం ఉంది.