‘కరోనా’ పుట్టిన చోటే.. పరీక్షా పరికరం..

దిశ, ఆదిలాబాద్: వూహాన్ సిటీ గుర్తుందా..! ఇవాళ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) పుట్టిన కేంద్రం అది. అక్కడ మొదలైన వైరస్ తొలుత ఆ సిటీని అతలాకుతలం చేసింది. తర్వాత యూరప్ దేశాలకు… అటుపై అమెరికా, భారత్ సహా రెండొందలకు పైగా దేశాల్లో విస్తరించి ఎందరో ప్రాణాలను కబళించింది. ఇప్పటికీ 20 లక్షలకు పైగా మంది కరోనా వైరస్ సోకి ఆస్పత్రుల్లో ఉన్నారు. అయితే, ఈ మహమ్మారి నిర్ధారణకు వ్యాధిగ్రస్తులకు చేసే పరీక్షలకూ […]

Update: 2020-04-16 07:03 GMT

దిశ, ఆదిలాబాద్: వూహాన్ సిటీ గుర్తుందా..! ఇవాళ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) పుట్టిన కేంద్రం అది. అక్కడ మొదలైన వైరస్ తొలుత ఆ సిటీని అతలాకుతలం చేసింది. తర్వాత యూరప్ దేశాలకు… అటుపై అమెరికా, భారత్ సహా రెండొందలకు పైగా దేశాల్లో విస్తరించి ఎందరో ప్రాణాలను కబళించింది. ఇప్పటికీ 20 లక్షలకు పైగా మంది కరోనా వైరస్ సోకి ఆస్పత్రుల్లో ఉన్నారు. అయితే, ఈ మహమ్మారి నిర్ధారణకు వ్యాధిగ్రస్తులకు చేసే పరీక్షలకూ ఆ వూహాన్ సిటీపైనే ఆధారపడాల్సి వస్తోంది.

ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా కట్టడిలో అత్యంత కీలకంగా మారిన వైద్య పరికరం థర్మల్ స్క్రీనింగ్ మిషిన్. దీని సహకారంతోనే దేశ, విదేశాల్లో ఉన్న అన్ని ఎయిర్ పోర్టులలో ముందుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతే అన్ని పరీక్షలు చేస్తారు. కరోనా లక్షణాలతో దవాఖానాల్లో చేరిన వారిని టచ్
చేయకుండా ఈ పరికరం‌తోనే జ్వర నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఆశా కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బందికి సైతం కరోనా అనుమానితుల శరీర ఉష్ణోగ్రతలు కొలిచేందుకుగాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాలకు థర్మల్ స్క్రీనింగ్ మిషిన్ల‌ను పంపిణీ చేసింది. కాగా ఈ పరికరం తయారైంది వుహాన్ సిటీలోనే కావడం గమనార్హం. రోగం, రోగం వచ్చిందనే నిర్ధారణకు పరీక్షలు చేసే పరికరం పుట్టింది వుహాన్‌లోనే. అయితే, ఈ మిషన్లు కొన్ని చోట్ల మొరాయిస్తున్నాయని తెలుస్తోంది. ఒకే వ్యక్తికి రెండు, మూడు సార్లు పరీక్షలు చేస్తే వేరువేరు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags: vuhan city, corona virus, covid 19, thermal screening machines, tests, positive, negative

Tags:    

Similar News