త్వరలో కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్

దిశ, వెబ్‌డెస్క్: భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ నవంబర్ మొదటివారంలో ప్రారంభంకాబోతున్నాయి. ఇప్పటికే మొదటి, రెండో దశ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేయగా మూడో దశకు డీసీజీఐ నుంచి అనుమతి లభించింది. క్లినికల్ ట్రయల్స్ తొలిదశలో 45మందికి, రెండో దశలో 55మందికి నిమ్స్‌లో టీకా ఇవ్వగా వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని ఇప్పటివరకూ టీకా తీసుకున్నవారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు స్పష్టం చేశారు. మూడో […]

Update: 2020-10-23 07:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ నవంబర్ మొదటివారంలో ప్రారంభంకాబోతున్నాయి. ఇప్పటికే మొదటి, రెండో దశ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేయగా మూడో దశకు డీసీజీఐ నుంచి అనుమతి లభించింది. క్లినికల్ ట్రయల్స్ తొలిదశలో 45మందికి, రెండో దశలో 55మందికి నిమ్స్‌లో టీకా ఇవ్వగా వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని ఇప్పటివరకూ టీకా తీసుకున్నవారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు స్పష్టం చేశారు. మూడో దశలో నిమ్స్‌లో మరో 200మందికి టీకా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 25కేంద్రాల్లో 25వేలకు పైగా వాలంటీర్లతో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది.

Tags:    

Similar News