బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతుందని.. యువతిని జుట్టుపట్టుకుని కొడుతూ..
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మాట్లాడుతుందని.. స్థానికులు ఆమెను దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల ప్రకారం.. ఓ యువతి, తన ప్రియుడితో కలిసి ఓ షాపు ముందు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి.. ఒక్కసారిగా యువతి జుట్టు పట్టుకుని కొడుతూ, ఇష్టం వచ్చినట్టు తిడుతూ, […]
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మాట్లాడుతుందని.. స్థానికులు ఆమెను దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల ప్రకారం.. ఓ యువతి, తన ప్రియుడితో కలిసి ఓ షాపు ముందు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి.. ఒక్కసారిగా యువతి జుట్టు పట్టుకుని కొడుతూ, ఇష్టం వచ్చినట్టు తిడుతూ, ఆమెను దారుణంగా కొట్టారు. యువతి ఎంత అరిచినా.. ఆమెను వదలకుండా వారు కొడుతూనే ఉన్నారు. ఈ వీడియోను పోలీసులు పరిశీలించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకుందీ ఇంకా తెలియరాలేదు.