తమిళనాడులో దారుణం… మరో పరువు హత్య

దిశ, వెబ్ డెస్క్: ప్రేమవ్యవహారంలో వరుసగా పరువు హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో హేమంత్ హత్య మరువకముందే తమిళనాడులో మరో ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు, తిరునల్వేలి జిల్లా నాంగునేరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళల తలలు నరికివేయడం స్థానికంగా కలకలం రేపింది. ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ప్రతీకార హత్యలుగా పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. కాగా ప్రేమ వ్యవహారంలో జరిగిన వరుస పరువు ప్రతీకార హత్యల్లో ఇరుకుటుంబాల్లో ఇప్పటివరకు ఐదు మర్డర్లు జరిగినట్టు జిల్లా ఎస్పీ ఎన్.మణివనన్ తెలిపారు. వివరాల్లోకి వెళితే… […]

Update: 2020-09-26 22:34 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రేమవ్యవహారంలో వరుసగా పరువు హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో హేమంత్ హత్య మరువకముందే తమిళనాడులో మరో ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు, తిరునల్వేలి జిల్లా నాంగునేరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళల తలలు నరికివేయడం స్థానికంగా కలకలం రేపింది. ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ప్రతీకార హత్యలుగా పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. కాగా ప్రేమ వ్యవహారంలో జరిగిన వరుస పరువు ప్రతీకార హత్యల్లో ఇరుకుటుంబాల్లో ఇప్పటివరకు ఐదు మర్డర్లు జరిగినట్టు జిల్లా ఎస్పీ ఎన్.మణివనన్ తెలిపారు.

వివరాల్లోకి వెళితే… నాంగునేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుగల్ కురీచ్చిలో శనివారం ఏ.షణ్ముగత్తె(50), ఎస్.శాంతి (45) అనే తల్లీకూతుళ్లు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఇద్దరినీ చంపి తలలు నరికేశారు. మారుగల్ కురీచ్చిలో నివాసముండే అరుణాచలం, షణ్ముగత్తెల కుమారుడు నంబిరాజన్ అదే గ్రామానికి చెందిన వాన్మతి అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు కలిసి గతేడాది ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో 2019 నవంబర్ లో వాన్మతి సోదరుడు చెల్లాసామి, అతని సహచరులతో కలిసి నంబిరాజన్ ను హత్య చేసి శిరచ్ఛేదనం చేశారు. ఈ ఘటనలో నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. నంబిరాజన్ హత్యకు ప్రతీకారంగా అతని కుటుంబసభ్యులు… వాన్మతి బంధువులు అరుముగం, సురేష్ లను హత్య చేశారు. ఈ ఘటనలో నేరస్థులుగా నంబిరాజన్ తల్లిదండ్రులు అరుణాచలం, షణ్ముగత్తై, వీరి బంధువులను పోలీసులు అరెస్టు చేశారు.

కొద్దిరోజుల క్రితం బెయిల్ పై షణ్ముగత్తె బయటకు వచ్చింది. మూడురోజుల క్రితం మిగిలిన నిందితులు కూడా బయటకు వచ్చారు. వీరిని చంపడానికి ఎదురు చూస్తున్న దుండగులు నిందితులను వెతుక్కుంటూ వచ్చి షణ్ముగతై ఇంటికి వెళ్లి ఆమెను హత్య చేసి, తలను నరికారు. అక్కడినుంచి అరుణాచలం-షణ్ముగత్తెల అల్లుడు మురుగన్ ఇంటికి వెళ్లారు.

అతను ఇంటిలో లేకపోయినప్పటికీ అరుణాచలం కూతురు శాంతిపై కత్తులతో దాడి చేశారు. అనంతరం ఆమె తలను కూడా నరికేశారు. వీరి కుమార్తె సెల్వి (14)పై సైతం కత్తులతో దాడి చేయగా స్వల్ప గాయాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు. ప్రతీకారం నేపథ్యంలోనే ఈ హత్యలు చేసి ఉండొచ్చని జిల్లా ఎస్పీ ఎన్‌.మణివనన్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News