కర్నూలులో విషాదం.. కార్తీక దీపం వెలిగిస్తుండగా..
దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ దగ్గర కేసీ కెనాల్‌లో కార్తీక దీపం వెలిగించి కెనాల్‌లో విడిచిపెట్టేందుకు ప్రయత్నించి ఓ మహిళ గల్లంతైంది. ఆమెను రక్షించే క్రమంలో భర్త సైతం గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళ్తే కార్తీక పౌర్ణమి సందర్భంగా అబ్బాస్ నగర్‌కు చెందిన ఇందిర, రాఘవేంద్ర అనే దంపతులు వినాయక ఘాట్‌లో కార్తీక స్నానమాచరించారు. అనంతరం కార్తీక దీపం వెలిగించారు. దీపంను కెనాల్‌లో వదిలేందుకు ఇందిర వెళ్లింది. […]
దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ దగ్గర కేసీ కెనాల్‌లో కార్తీక దీపం వెలిగించి కెనాల్‌లో విడిచిపెట్టేందుకు ప్రయత్నించి ఓ మహిళ గల్లంతైంది. ఆమెను రక్షించే క్రమంలో భర్త సైతం గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళ్తే కార్తీక పౌర్ణమి సందర్భంగా అబ్బాస్ నగర్‌కు చెందిన ఇందిర, రాఘవేంద్ర అనే దంపతులు వినాయక ఘాట్‌లో కార్తీక స్నానమాచరించారు. అనంతరం కార్తీక దీపం వెలిగించారు. దీపంను కెనాల్‌లో వదిలేందుకు ఇందిర వెళ్లింది.
అయితే ప్రమాదవశాత్తు ఆమె కెనాల్‌లో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన భర్త ఆమెను రక్షించేందుకు కాలువలోకి దిగాడు. అతడికి ఈత రాకపోవడంతో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం వెతికారు. అయితే పడిదెంపాడు వద్ద భార్య భర్తల మృతదేహాలు లభించాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.