అద్భుతంగా మొదటివార్డు అభివృద్ధి.. కౌన్సిలర్‌కు ప్రజల అభినందనలు
దిశ, గండిపేట్: సేవే మార్గంగా.. ప్రేమే లక్ష్యంగా.. వార్డు అభివృద్ధి ఆదర్శవంతంగా జరుగుతోంది. నార్సింగి మున్సిపాలిటీలో ఆ వార్డు ప్రత్యేకం. మున్సిపాలిటీలోని వార్డులన్నీ ఒక ఎత్తైతే, ఆ వార్డు మరో ఎత్తు. మున్సిపాలిటీలో అన్ని వార్డులకు ఆ వార్డు తలమానికంగా నిలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కౌన్సిలర్ బి.యాదమ్మ కిషోర్ యాదవ్, పక్కా ప్రణాళికతో పనులు చేస్తూ.. నార్సింగి మున్సిపాలిటీలోనే వారు కౌన్సిలర్ ఉన్న మొదటి వార్డును అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలిపారు. […]
దిశ, గండిపేట్: సేవే మార్గంగా.. ప్రేమే లక్ష్యంగా.. వార్డు అభివృద్ధి ఆదర్శవంతంగా జరుగుతోంది. నార్సింగి మున్సిపాలిటీలో ఆ వార్డు ప్రత్యేకం. మున్సిపాలిటీలోని వార్డులన్నీ ఒక ఎత్తైతే, ఆ వార్డు మరో ఎత్తు. మున్సిపాలిటీలో అన్ని వార్డులకు ఆ వార్డు తలమానికంగా నిలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కౌన్సిలర్ బి.యాదమ్మ కిషోర్ యాదవ్, పక్కా ప్రణాళికతో పనులు చేస్తూ.. నార్సింగి మున్సిపాలిటీలోనే వారు కౌన్సిలర్ ఉన్న మొదటి వార్డును అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలిపారు.
ఎన్నికల ముందు అభివృద్ధికి నోచుకోక వెలవెలబోయిన ఈ వార్డు, యాదమ్మ కిషోర్ యాదవ్ బాధ్యతలు తీసుకున్న నాటినుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ నిత్యం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మున్సిపాలిటీలోనే మొదటి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో విరామం తీసుకోకుండా అడుగులు వేస్తున్నారు. వార్డులో ప్రధాన సమస్యలుగా ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, పారిశుధ్య వ్యవస్థల నిర్వహణ పకడ్బంధీగా చేపడుతూ వార్డును బలోపేతం చేస్తున్నారు. అందుకే ఎన్నికల ముందే వారి వ్యక్తిత్వం, సామాజిక సేవా దృక్పదం తెలిసిన ప్రజలు కౌన్సిలర్‌గా వారినే గెలిపించుకున్నారు.
చైర్మన్, వైస్ చైర్మన్‌లతో సత్సంబంధాలు
నార్సింగి మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కౌన్సిలర్ అయినప్పటికీ కౌన్సిలర్ అభివృద్ధిలో మాత్రం వెనుకడుగు వేయడం లేదు. అభివృద్ధిలో ఎంతటి ఒడిదుడుకులనైనా తట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు సమస్యలను వివరిస్తూ, వారితో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకొని అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సాయశక్తులా పని చేస్తున్నారు. వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ ప్రత్యేకంగా పరిశీలించి దశలవారీగా పనులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, అధికారులను సమన్వయం చేసుకుంటూ వ్యక్తిగతంగా తోచిన సాయం చేసి, ఆమె ఉదారాన్ని చాటుకుంటున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అకుంటిత దీక్షతో పని చేస్తున్న కౌన్సిలర్ యాదమ్మ కిషోర్ యాదవ్‌కు ప్రజలు అభినందిస్తున్నారు.