రసాభాసగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ..

         ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రారంభమైన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రజలను పట్టి పీడిస్తోందని ఎంఐఎం కార్పొరేటర్లు మేయర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంటు ముసుగులో భారీగా అవినీతి జరిగిందని అందుకు బాధ్యత వహిస్తూ డైరక్టర్ విశ్వజిత్ రాజీనామా చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. రూ.లక్షల్లో పేదలపైన జరిమానాలు వేస్తే వారంతా ఎలా భరిస్తారని ఆందోళనలు చేశారు. జీహెచ్ఎంసీ చేపట్టిన స్పోర్ట్స్ అథారిటీ ముసుగులో […]

Update: 2020-02-08 04:20 GMT

ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రారంభమైన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రజలను పట్టి పీడిస్తోందని ఎంఐఎం కార్పొరేటర్లు మేయర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంటు ముసుగులో భారీగా అవినీతి జరిగిందని అందుకు బాధ్యత వహిస్తూ డైరక్టర్ విశ్వజిత్ రాజీనామా చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. రూ.లక్షల్లో పేదలపైన జరిమానాలు వేస్తే వారంతా ఎలా భరిస్తారని ఆందోళనలు చేశారు. జీహెచ్ఎంసీ చేపట్టిన స్పోర్ట్స్ అథారిటీ ముసుగులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఎంఐఎం కార్పొరేటర్లు మేయర్‌తో వాదించారు. దీనిపై చర్చ జరపాలని పట్టుబట్టారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చని సీఏఏ చట్టాన్ని వ్యతిరేకించాలని ఎంఐఎం కార్పొరేటర్లు కోరగా బీజేపీ కార్యకర్తలు దానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. దీంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారగా చేసేదేమీ లేక మేయర్ బొంతు రామ్మోహన్ సమావేశాన్ని వాయిదా వేశారు.

Tags:    

Similar News