‘గ్రీన్ ఇండియా’లో గోల్‌మాల్.. కమిషనర్‌ను సస్పెండ్ చేయండి

దిశ, హుజూర్ నగర్: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ‘గ్రీన్ ఇండియా’ పేరుతో నిధుల్లో గోల్‌మాల్ జరిగినట్లు పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. గురువారం మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్‌తో కలిసి కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి, జక్కుల వీరయ్యలు పట్టణంలోని ప్రభుత్వ లేఅవుట్ స్థలంలోని మొక్కలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలనే చూపి, ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ పేరుతో మళ్లీ నిధులు డ్రా చేశారని ఆరోపించారు. ఈనెల 14వ […]

Update: 2021-06-17 07:16 GMT

దిశ, హుజూర్ నగర్: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ‘గ్రీన్ ఇండియా’ పేరుతో నిధుల్లో గోల్‌మాల్ జరిగినట్లు పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. గురువారం మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్‌తో కలిసి కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి, జక్కుల వీరయ్యలు పట్టణంలోని ప్రభుత్వ లేఅవుట్ స్థలంలోని మొక్కలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలనే చూపి, ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ పేరుతో మళ్లీ నిధులు డ్రా చేశారని ఆరోపించారు. ఈనెల 14వ తేదీన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్‌లోని ఎజెండాలో పెట్టిన ఈ అంశంపై డీసెంట్ నోట్ ఇచ్చామని గుర్తుచేశారు.

మున్సిపల్ కమిషనర్ ఎజెండాలో పేరు కూడా పెట్టకుండా.. ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై రూ.4,73,398 లక్షలు కాజేశాడని ఆరోపించారు. అత్యవసరం పేరుతో జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకుని టెండర్లు లేకుండా మొక్కలు నాటినట్లు ఎలా సృష్టిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను కూడా కమిషనర్ తప్పుదోవ పట్టిస్తూ.. హరితహారం మొక్కలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నాటినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కౌన్సిల్ తీర్మానం లేకుండా ఖజానా నుంచి కాంట్రాక్టర్‌ ఖాతాలోకి నగదు ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగం చేస్తే ఊరుకునే లేదని తెలిపారు.

Tags:    

Similar News